- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్.. హిట్ దక్కేనా?
వైష్ణవ్ తేజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా ప్లాన్‌గా ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దిశ, సినిమా: మెగా హీరో వైష్ణవ్ తేజ్‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకని భారీ క్రేజ్ సంపాదించుకున్నారు . ఆ తర్వాత ఆయన పలు విభిన్నమైన సినిమాల్లో నటించినప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోయారు. దీంతో కథల ఎంపికలో కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన, కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ సరైన ప్రాజెక్ట్ కోసం వేచి చూశారు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా ప్లాన్‌గా ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్ కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఆయన తన తదుపరి చిత్రాన్ని చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ అడ్డాల ఇటీవల వైష్ణవ్ తేజ్‌కు ఒక అందమైన ప్రేమకథను వినిపించారట. ఈ కథ, అందులోని పాత్రలు వైష్ణవ్‌కు బాగా నచ్చడంతో వెంటనే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్లను రూపొందించడంలో శ్రీకాంత్ అడ్డాలాకి ప్రత్యేకమైన మార్క్ ఉంది. ఈ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా వైష్ణవ్ తేజ్ కెరీర్‌కు మళ్లీ మంచి ఊపునిస్తుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.






