- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వడివేలు నరకం చూపించాడు.. తట్టుకోలేక 16 సినిమాలు వదులుకున్నానంటూ నటి సంచలన వ్యాఖ్యలు!
నిజాయితీగా చెప్పాలంటే ఆయనతో పని చేయడం నావల్ల కాలేదు. షూటింగ్ సమయంలో నేను ఒక రకమైన నరకం చూశాను. ఆయనను భరించడం చాలా కష్టమనిపించింది.

దిశ, సినిమా: కోలీవుడ్ నటి, నిర్మాత సోనా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపుతున్నాయి. స్టార్ కమెడియన్ వడివేలు గురించి ఆమె షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఆయన వల్ల తాను ఏకంగా 16 సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. రజనీకాంత్ నటించిన 'కుశేలన్' (తెలుగులో 'కథానాయకుడు') సినిమాలో సోనా, వడివేలు కాంబినేషన్‌లో వచ్చిన కామెడీ సీన్లు అప్పట్లో బాగా క్లిక్ అయ్యాయి. ఆ సినిమా తర్వాత వీరిద్దరి జోడీకి మంచి డిమాండ్ ఏర్పడింది.
వడివేలుతో కలిసి నటించమని సోనాకు వరుసగా 16కు పైగా అవకాశాలు వచ్చాయట. అయితే వాటన్నింటినీ ఆమె మర్యాదపూర్వకంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. "నాకు ఆ సినిమాల్లో నటించడం ఇష్టం లేక కాదు.. నా ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం నాకు చాలా ముఖ్యం. అందుకే ఆ ఆఫర్లన్నింటినీ వదులుకున్నాను" అని సోనా స్పష్టం చేశారు. వడివేలుతో పని చేయడంపై సోనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. "నిజాయితీగా చెప్పాలంటే ఆయనతో పని చేయడం నావల్ల కాలేదు. షూటింగ్ సమయంలో నేను ఒక రకమైన నరకం చూశాను. ఆయనను భరించడం చాలా కష్టమనిపించింది.
అందుకే ఆయనతో ఇక కలిసి నటించకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఈ విషయం గురించి ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిదని నేను భావిస్తున్నాను" అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే వడివేలు తనను ఎలా ఇబ్బంది పెట్టారు? అందుకు గల కారణాలు ఏంటి? అనే విషయాలను మాత్రం ఆమె పూర్తిగా బయటపెట్టలేదు. కాగా.. వడివేలుపై గతంలో కూడా కొందరు నటీనటులు ఇబ్బంది పెడతారని ఆరోపణలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సోనా ఏకంగా 16 సినిమాలు వదులుకున్నానని చెప్పడంతో ఈ ఇష్యూ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు స్టార్ కమెడియన్‌గా వెలిగిన వడివేలు, ఇలాంటి వివాదాల వల్ల కొంతకాలం సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్న సమయంలో సోనా చేయడం గమనార్హం.






