సంక్రాంతి బరిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన మూవీ మేకర్స్ (వీడియో)

by Mallepaka Hamsa |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇటీవల ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

సంక్రాంతి బరిలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా.. క్లారిటీ ఇచ్చిన మూవీ మేకర్స్ (వీడియో)
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇటీవల ‘హరిహర వీరమల్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించనప్పటికీ ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustad Bhagat Singh)ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ మూవీని ప్రముఖ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నవీన్ యెర్నేనీ, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీలీల, రాశీఖన్నా(Raashi Khanna) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రానికి సంబంధించ ఇటీవలే క్లైమాక్స్ పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు.

అన్నపూర్ణ స్టుడియోలో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్‌ని సోమవారం సీనీ కార్మికులు అడ్డగించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. గత కొద్ది కాలంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంక్రాంతి విడుదల కాబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో పాటు పలువురి స్టార్ హీరోల సినిమాలు విడుదల కానున్నట్లు వాటికి పోటీగా ఈ మూవీ రాబోతున్నట్లు టాక్. ఈక్రమంలో.. తాజాగా, ఓ ఈవెంట్‌లో పాల్గొన్న మూవీ మేకర్స్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ‘‘సినీ కార్మికుల బంద్ వల్ల మా సినిమా పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. హీరో పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఇంకా వారం రోజుల షూట్ ఉంది. ఆ తర్వాత మరో 20 -25 రోజుల షూటింగ్‌తో సినిమా మొత్తం కంప్లీట్ అవుతుంది.

ఈ సినిమాని సంక్రాంతికి తీసుకొస్తారా అని కొందరు అడుతుగున్నారు. ఇంకా షూటింగే పూర్తికాలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడే చెప్పలేం. షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. అన్నీ ఆలోచించుకుని ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్నది నిర్ణయించుకుని అప్పుడు ప్రకటిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న పవర్ స్టార్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

link

Next Story