- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వింబుల్డన్ వుమెన్... ఫైనల్లోకి నోస్కోవా
వింబుల్డన్ 2026 మహిళల సింగిల్స్ టోర్నమెంట్ ఫైనల్స్ కు చేరుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : వింబుల్డన్ 2026 మహిళల సింగిల్స్ టోర్నమెంట్ ఫైనల్స్ కు చేరుకుంది. జూలై 11 శనివారం జరగబోయే ప్రతిష్టాత్మక ఫైనల్ పోరులో 9వ సీడ్ లిండా నోస్కోవా, 10వ సీడ్ కరోలినా ముచోవా గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం తలపడనున్నారు. అయితే వీరిద్దరూ చెక్ రిపబ్లిక్ కు చెందిన వారే కావడం విశేషం.
సెమీఫైనల్లో నోస్కోవా క్లినికల్ షో
గురువారం జరిగిన మొదటి సెమీఫైనల్‌లో 21 ఏళ్ల చెక్ రిపబ్లిక్ యువ సంచలనం లిండా నోస్కోవా అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించింది. ఉక్రెయిన్‌కు చెందిన 12వ సీడ్ మార్టా కోస్ట్‌యుక్‌ను 6-4, 6-4 తో వరుస సెట్లలో ఓడించి, తన కెరీర్‌లోనే మొదటి గ్రాండ్ స్లామ్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. మ్యాచ్ అంతటా నోస్కోవా బేస్‌లైన్ ఆటతీరు, పవర్‌ఫుల్ ఫోర్‌హ్యాండ్ షాట్లు కోస్ట్‌యుక్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు.
ఉత్కంఠపోరులో నెగ్గిన ముచోవా
మరో సెమీఫైనల్‌లో 10వ సీడ్ కరోలినా ముచోవా అమెరికా స్టార్, మాజీ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కోకో గాఫ్‌తో తలపడి అద్భుత విజయాన్ని అందుకుంది. మూడు సెట్ల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరులో ముచోవా 6-2, 1-6, 7-6 తో గెలుపొందింది. మూడో సెట్‌లో మ్యాచ్ సూపర్ టైబ్రేకర్ వరకు వెళ్లగా, ముచోవా తన అనుభవాన్ని, ప్రశాంతతను ఉపయోగించి ఒత్తిడిని అధిగమించింది. గతంలో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన ముచోవాకు ఇది రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్.
ఒలింపిక్ భాగస్వాములు.. ఇప్పుడు ప్రత్యర్థులు!
ఈ ఫైనల్ గేమ్ లో నోస్కోవా, ముచోవా ఇద్దరూ గతంలో ప్యారిస్ ఒలింపిక్స్‌లో చెక్ రిపబ్లిక్ తరఫున మహిళల డబుల్స్ ఆడారు. ఇప్పుడు వింబుల్డన్ సింగిల్స్ ట్రోఫీ కోసం నెట్‌కు ఇరువైపులా హోరాహోరీగా తలపడనున్నారు. లండన్ గ్రాస్ కోర్టులో ఈ ఇద్దరిలో ఎవరు వింబుల్డన్ క్వీన్ గా అవతరిస్తారో చూడాలి మరి.






