- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ కాంగ్రెస్ లో వివాదాలు.. అధిష్టానం కీలక నిర్ణయం
తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు ముగింపు పలికేందుకు పార్టీ అధిష్ఠానం గట్టి చర్యలే చేపట్టింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలకు ముగింపు పలికేందుకు పార్టీ అధిష్ఠానం గట్టి చర్యలే చేపట్టింది. ఈ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ తీసుకున్న నిర్ణయం పార్టీ శ్రేణుల్లో క్రమశిక్షణను పెంచేందుకు తోడ్పతుందని అభిప్రాయపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత కడియం శ్రీహరి మధ్య ప్రోటోకాల్, నియోజకవర్గాల విషయాలపై కొంతకాలంగా సాగుతున్న వివాదాన్ని చక్కదిద్దేందుకు ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌ను నియమించారు. అలాగే, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామేల్ వర్గం వర్సెస్ చామల వర్గం మధ్య ఉన్న గ్రూపు రాజకీయాల పరిష్కార బాధ్యతను సీనియర్ నేత, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించింది అధిష్టానం. పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఇరువర్గాల వాదనలు విని నివేదిక సమర్పించిన తర్వాత అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ చర్యల ద్వారా పార్టీ ప్రతిష్ట దెబ్బతినకుండా అంతర్గత సంక్షోభాన్ని ముందే అదుపు చేయాలని లీడర్‌షిప్ భావిస్తోంది.






