క్రికెటర్‌తో ఆ హీరోయిన్ పెళ్లి?.. మెడలో మంగళసూత్రంతో..

by Hajipasha |   (  Updated:2022-10-12 08:10:21  IST  )

బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా లేటెస్ట్ అవతార్ నెటిజన్స్‌కు షాకిచ్చింది. Latest Telugu News

క్రికెటర్‌తో ఆ హీరోయిన్ పెళ్లి?.. మెడలో మంగళసూత్రంతో..
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా లేటెస్ట్ అవతార్ నెటిజన్స్‌కు షాకిచ్చింది. క్రికెటర్ రిషబ్ పంత్‌ను ఇంకా ప్రేమిస్తున్నానని ఒక్కో హింట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆమె.. ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు రిషబ్ ఆడుతుండటంతో తను కూడా అక్కడ ల్యాండ్ అయిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపి ట్రోల్స్ ఎదుర్కొన్న నటి.. ఇప్పుడు ఏకంగా మెడలో మంగళసూత్రం, నుదుట సింధూరం, శారీ ధరించిన పిక్స్ పోస్ట్ చేసి మరోసారి నెటిజన్ల ట్రోలింగ్‌కు బలవుతోంది. 'ప్రేమలో ఉన్న ప్రియురాలికి సింధూరం కన్నా ప్రియమైనది మరేదీ ఉండదు. క్రతువులన్నీ ఆచారాల ప్రకారం జరగాలి. జీవితాంతం నేను నీతో ఉండిపోవాలి ప్రియా' అంటూ పోస్ట్ పెట్టడంతో మరోసారి విమర్శలు తప్పలేదు. కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. 'అక్కా.. పంత్‌ను వదిలేయ్. దగ్గరలోనే వరల్డ్ కప్ ఉంది' 'ఇలా చేసి నిన్ను నువ్వు దిగజార్చుకోకు' 'పెళ్లి అయిపోయిందా ఏంటి?' అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2018కి ముందు డేటింగ్‌లో ఉన్న రిషబ్, ఊర్వశి తర్వాత విడిపోయినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : 'కృష్ణ వ్రింద విహారి'.. ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Next Story