చిక్కుల్లో Urfi Javed.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

by Mallepaka Hamsa |   (  Updated:2022-12-13 03:04:46  IST  )

బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ ఇండియన్ నంబర్ రియాల్టీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది..

చిక్కుల్లో Urfi Javed.. పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్: బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ ఇండియన్ నంబర్ రియాల్టీ షోలో పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఉర్ఫీ జావెద్ బాలీవుడ్‌లో పలు సీరియల్స్‌లో నటించింది. నటించిన దాని కన్నా బోల్డ్ డ్రెస్సులతోనే ప్రేక్షకుల్లో ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. నిత్యం సోషల్ మీడియాలోనే కాకుండా బహిరంగంగా కూడా అందాలను ఆరబోస్తూ యువతను ఆకట్టుకుంటుంది. తన డ్రెస్సుల వల్ల పలుసార్లు చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే. తాజాగా, ముంబైలోని అందేరీలో ఆలీ కషిఫ్ ఖాన్ దేశ్‌ముఖ్ అనే న్యాయవాది ఉర్ఫీ జావెద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పొట్టి డ్రెస్సులతో అసభ్యకర చర్యలకు పాల్పడుతుందని కేసు నమోదు చేశాడు.

Also Read...

Anjali denies marriage rumour :ఆ కుర్రాడితో అంజలి పెళ్లి అయిపోయిందా..!

Next Story