మెగా ఫ్యామిలీలోకి కోడలుగా అడుగుపెట్టనున్న ఉప్పెన బ్యూటీ!!

by Disha Web Desk 9 |
మెగా ఫ్యామిలీలోకి కోడలుగా అడుగుపెట్టనున్న ఉప్పెన బ్యూటీ!!
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది యంగ్ బ్యూటీ ‘కృతి శెట్టి’. మొదట్లో హిట్లు అందుకున్నప్పటికీ.. తర్వాత ఈ అమ్మడుకు సినిమాలు అంతగా కలిసి రాలేదు. వరుస పరాజయాలు ఎదుర్కొంది. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందని సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారం జరుగుతోంది. కాగా వరుడు టాలీవుడ్‌లోని బడా ఫ్యామిలీకి చెందిన ఓ యంగ్ హీరోనేనని టాక్ వినిపిస్తోంది. విషయానికొస్తే.. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ‘ఉప్పెన’ సినిమాతో వైష్ణవ్ తేజ్‌కు, ఈ హీరోయిన్‌కు మధ్య మంచి సన్నిహిత్యం ఏర్పడిందట. దీంతో అప్పటి నుంచి వీరిద్దరి మధ్య రిలేషన్ కొనసాగుతుందని.. త్వరలో వైష్ణవ్-కృతి వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారని తాజాగా ఇండస్ట్రీ వర్గాల ఇన్ సైడ్ నుంచి వినిపిస్తున్న సమాచారం. ఈ విషయాన్ని కృతి తన పేరెంట్స్‌కు చెప్పడంతో వారు కూడా ఒప్పుకున్నారట.

Read More : కాబోయే భార్యకు అవకాశాలు లేకపోవడంతో.. డైరెక్టర్‌ను అడిగి మరీ ఆ మూవీలో ఛాన్స్ ఇప్పించిన మెగా ప్రిన్స్

Next Story

Most Viewed