- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విషయం వినగానే కుప్పకూలిపోయా.. చాలా కోపం వచ్చిందంటూ తరుణ్ భాస్కర్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) దర్శకత్వంలో వచ్చి కల్డ్ క్లాసిక్‌గా నిలిచిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’(Ee Nagaraniki Emaindi).

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) దర్శకత్వంలో వచ్చి కల్డ్ క్లాసిక్‌గా నిలిచిన సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’(Ee Nagaraniki Emaindi). ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. అయితే ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల కాగా.. పార్ట్-1లో నటించిన వారంతా ఇందులో భాగం కాబోతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈనేపథ్యంలో.. ఇందులో కార్తీక్ క్యారెక్టర్ చేసిన సాయి సుశాంత్ రెడ్డి సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే తరుణ్ భాస్కర్ ఓ ఎమోషనల్ నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తరుణ్ భాస్కర్‌కు ఈ విషయంపై ప్రశ్నలు ఎదురవగా.. షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘సుశాంత్‌కు ఫోన్ చేసినప్పుడు అతను నటించనని చెప్పగానే నేను ఒక్కసారిగా కుప్పకూలిపోయాను. నాకు చాలా కోపం వచ్చింది, కానీ అతని వ్యక్తిగత నిర్ణయాన్ని నేను గౌరవించాల్సి వచ్చింది" అని తరుణ్ వెల్లడించారు. సుశాంత్ ప్రస్తుతం తన తండ్రి వ్యాపార బాధ్యతల్లో బిజీగా ఉన్నారని, అందుకే సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని ఆయన స్పష్టం చేశారు. సుశాంత్ తప్పుకున్నప్పటికీ, సినిమాలో ‘కార్తీక్’ పాత్ర మాత్రం అలాగే ఉంటుందని తరుణ్ భాస్కర్ వెల్లడించారు. ఈ పాత్ర కోసం హిట్, యానిమల్ వంటి చిత్రాల్లో నటించిన శ్రీకాంత్ మాగంటిని ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. "నటుడు మారొచ్చు కానీ, కార్తీక్ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. ప్రస్తుతం నేను ఎడిటింగ్ రూమ్ లో ఫుటేజ్ చూస్తున్నప్పుడు కూడా నాకు అందులో కార్తీక్ మాత్రమే కనిపిస్తున్నాడు. అదే సినిమా మ్యాజిక్.
ప్రేక్షకులను నిరాశపరిచే ప్రసక్తి లేదు’’ అని తరుణ్ ధీమా వ్యక్తం చేశారు. నటుడు గౌరవప్రదంగా తప్పుకున్నా, కథపై ఉన్న నమ్మకంతో తాను ముందుకు సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ చక్కర్లు కొడుతోంది. కాగా.. ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ పేరుతో రాబోతున్న ఈ సీక్వెల్‌లో విష్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను మళ్ళీ సందడి చేయబోతున్నారు. పాత మిత్రుల గ్యాంగ్‌లో ఒకరు మారినా, అదే తరహా కామెడీ, ఎమోషన్‌తో ప్రేక్షకులను అలరించడానికి చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ సీక్వెల్‌కు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ రానున్నట్లు సమాచారం.






