క్లీంకారాతో ఉపాసన అప్పుడు మాత్రమే టైం స్పెండ్ చేస్తారు.. కేర్ టేకర్ షాకింగ్ కామెంట్స్

by Kavitha |
క్లీంకారాతో ఉపాసన అప్పుడు మాత్రమే టైం స్పెండ్ చేస్తారు.. కేర్ టేకర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కపూల్ రామ్ చరణ్- ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి వివాహం జరిగిన 11 ఏళ్లకు క్లీంకారా‌ను తమ జీవితంలోకి ఆహ్వానించారు. ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు, కష్టాల తర్వాత క్లీంకార జన్మించడం వారికి పూర్తిస్థాయిలో అదృష్టాన్ని తీసుకొచ్చింది. క్లీంకార వస్తునే మహాలక్ష్మిని తీసుకొచ్చింది అని అనడంలో ఏమాత్రం అతియోశక్తి లేదు. ఒక్క ఉపాసన – రాంచరణ్ లకే కాదు తాతలకు కూడా బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఏకంగా చిరంజీవికి పద్మ విభూషణ్ లభించడం , రాజకీయాల్లోకి రావాలనుకున్న పవన్ కళ్యాణ్ కోరిక నెరవేరడమే కాకుండా ఏకంగా ఏపీకి డిప్యూటీ సీఎంగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు. అలాగే ఆస్కార్ కార్పెట్ పై తల్లిదండ్రులు ఇద్దరు మెరిసారు. పైగా ఇటీవలే రామ్ చరణ్ గౌరవ డాక్టరేట్‌ను కూడా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా క్లీంకార మెగా మహాలక్ష్మీ అని మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా చెబుతూ ఉంటారు.

ఇదిలా ఉండగా క్లీంకార బాగోగుల కోసం రామ్ చరణ్, ఉపాసన బాలీవుడ్ సెలబ్రిటీల పిల్లలకు కేర్ టేకర్‌గా పని చేసిన లలిత అనే మహిళలను నియమించుకున్న సంగతి తెలిసిందే. ఈమె అంబానీ ఫ్యామిలీతో పాటు దక్షిణాదికి చెందిన ఎంతో మంది సెలబ్రిటీ కపుల్స్ పిల్లలకు ఆయాగా వ్యవహరించింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న లలిత రామ్ చరణ్, ఉపాసన దంపతులపై ప్రశంసలు కురిపించింది.

ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. “రామ్ చరణ్, ఉపాసన చాలా మంచివారు. నేను ఎంతోమంది స్టార్ కిడ్స్‌కి ఆయాగా పనిచేశాను. వాళ్ళందరూ నన్ను బాగా చూసుకున్నారు. వీరు కూడా తమ కుటుంబంలో ఒకరిలా నన్ను చూసుకోవడం హ్యాపీగా అనిపిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరూ చాలా మంచి వాళ్ళు. నేను రెస్ట్ తీసుకునే టైంలో ఉపాసన క్లీంకారాను చూసుకుంటారు. ఆమె అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ అయినప్పటికీ కూడా చాలా సింపుల్‌గా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆమెది. బేబీ విషయంలో కూడా నాకు ఏ రోజు ఆర్డర్స్ వేయలేదు. నన్ను వారి కుటుంబంలో ఒకరిగా చేర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ లలిత ఉపాసన , రాంచరణ్ గొప్పతనాన్ని గుర్తు చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. స్టార్ కపుల్స్ అయినా వీరు.. కేర్ టేకర్‌ను అంత మంచిగా చూసుకోవడంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Advertisement

Next Story