చిరంజీవి నివాసంలో ఉపాసన సీమంతం.. పిక్స్ వైరల్

by Disha Web Desk 7 |
చిరంజీవి నివాసంలో ఉపాసన సీమంతం.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా: మెగా హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో మెగా కుటుంబంతో పాటు, అభిమానులు కూడా పుట్టబోయే బిడ్డ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా చిరంజీవి నివాసంలో ఉపాసనకు బుధవారం బేబీ షవర్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ ఇంటికి బుల్లి అతిథి వచ్చేది ఎప్పుడో చెప్పేశారు ఉపాసన. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘డాక్టర్లు జులైలో డెలివరీ డేట్‌ ఇచ్చారు. ఈ సమయంలో చరణ్‌ నన్ను దగ్గరుండి చూసుకుంటున్నాడు. పుట్టిన బిడ్డను చూసుకుంటూనే నా కెరీర్‌పై దృష్టిపెడతా’ అని ఉపాసన చెప్పింది.


Read More:

ప్రాణాలు కాపాడిన యువకుడికి రూపాయి కూడా సాయం చేయని సాయి ధరమ్ తేజ్.



Next Story

Most Viewed