ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని దాచిపెట్టిన ఉపాసన.. పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

by Disha Web Desk 8 |
ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని దాచిపెట్టిన ఉపాసన.. పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
X

దిశ, సినిమా : మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ప్రజాసేవతో కొట్లాది మంది మనసులు గెలుచుకుంది. తన మంచితనానికి , మంచి మనసుకు చాలా మంది ఫిదా అయ్యారు.ఇక ఉపాసనకు సంబంధించిన ఏ వార్త వచ్చినా మెగా అభిమానులు చాలా ఆసక్తిగా చూస్తుంటారు.

ఇక క్లీంకార పుట్టిన తర్వాత ఉపాసన తన మొదటి ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. పెళ్లైన పది సంవత్సరాల తర్వాత వీరికి పాప పుట్టింది. దీంతో మెగా కోడలు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. ప్రతీ విషయాన్ని షేర్ చేసుకుంది.

ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చరణ్, నేను చాలా సంతోషంగా ఉంటాం.ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటూ, గౌరవించుకుంటాం. మా ఇద్దరి మధ్య హద్దులు కూడా ఉంటాయి. ఒకరి కెరీర్ లో ఒకరు ఇన్వాల్వ్ అవ్వం, వ్యక్తిగత విషయాల్లో మాత్రం ఒక్కటిగా ఉంటాం అని తెలిపారు.అలాగే క్లింకార ఓ మిరాకిల్. తాను పుట్టాక చాలా సంతోషంగా అనిపించింది. మాకు పెళ్లై 10 సంవత్సరాలకు పిల్లలు పుట్టారు. ఈ మధ్యకాలంలో చాలా మాటలను ఎదుర్కొన్నాం.. మేము అన్ని విధాలా సెట్ అయ్యాం అనుకున్నప్పుడే పిల్లలను కనాలి అనుకున్నాం..అలానే క్లీంకారకు జన్మనిచ్చాం అని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగానే ఉపాసన తన అత్తమ్మ, మామయ్య, ఆడపడుచులు, అమ్మ,నాన్న ఇలా ప్రతీ ఒక్కరి గురించి, ప్రతీ విషయాన్ని ఓపెన్‌గా తన అభిమానులతో పంచుకుంది.

అయితే ఉపాసన ఇంటర్వ్యూలో మొదటి సారి తన ఫ్యామిలీ గురించి ఓపెన్‌గా మాట్లాడే సరికి మెగా ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేశారు.మెగా కోడలు అంటే ఇది, ఓపెన్‌గా ఉంటుంది అంటూ ముచ్చటించుకున్నారు. అయితే కొంత మంది మాత్రం చరణ్ భార్యపై నెగిటివ్ కామెంట్స్ చేశారు.ఉపాసన మాట్లాడిన పూర్తి ఇంటర్వ్యూలో ఎక్కడ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శ్రీజ, నిహారిక విడాకుల స్పందించిన మూమెంట్స్ లేవు ,దీంతో కొందరు నెటిజన్స్ ఇంటర్వ్యూలో మాట్లాడేటప్పుడు అలాంటి ప్రశ్నలు అడగకూడదు అని ముందుగానే వార్నింగ్ ఇచ్చినట్లు ఉంది ఉపాసన, అందుకే వారు ఆ విషయాలకు సంబంధించి ఎలాంటి ప్రశ్నలు వేయలేదు అంటూ నెట్టింట పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు.



Next Story