ఇప్పటి వరకు జిమ్ ముఖం కూడా చూడలేదు: Sai Pallavi

by Chukka Sudharani |   (  Updated:2022-10-21 16:32:00  IST  )

ప్రతి ఒక్క హీరోయిన్ సినిమాలు చేస్తున్న కొద్దీ బాడీ, ఫేస్‌లో చేంజెస్ ఎదుర్కొంటారు. కానీ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మాత్రం ఎప్పుడూ ఒకేలా నాజూకుగా ఉంటుంది.

ఇప్పటి వరకు జిమ్ ముఖం కూడా చూడలేదు: Sai Pallavi
X

దిశ, సినిమా : ప్రతి ఒక్క హీరోయిన్ సినిమాలు చేస్తున్న కొద్దీ బాడీ, ఫేస్‌లో చేంజెస్ ఎదుర్కొంటారు. కానీ నేచురల్ బ్యూటీ సాయి పల్లవి మాత్రం ఎప్పుడూ ఒకేలా నాజూకుగా ఉంటుంది. తాను ఇప్పటి వరకు నటించిన ప్రతి ఒక్క మూవీలో కొంచెం కూడా మార్పు కనిపించలేదు. జిమ్ , వ్యాయామం, యోగ ఇలా రకరకాల ఫిట్‌నెస్ ప్రయోగాలు చేస్తేనే ఇలా జరుగుతుంది కానీ సాయి పల్లవి మాత్రం జిమ్, డైట్ అసలు ఫాలో కాదట. మెడిసిన్ చదివిన తనకు మొదటి నుంచి బాడీ మీద కంట్రోల్ ఉందట. ఏం తిన్నా.. ఎంత తిన్నా.. బాడీని కరెక్ట్ ఫిజిక్‌లో పెట్టుకోవడానికి.. హెల్తీగా ఉండటానికి చక్కగా ఇంటి పనులు చేసుకుంటూ ఉంటుందట. ఇక బ్రేక్ ఫాస్ట్‌లో రాగి జావా, రెండు ఇడ్లీ.. మధ్యాహ్నం భోజనంలో రసం అన్నం, ఒక వెజిటేబుల్స్ ఫ్రై.. ఈవినింగ్ రెండు చపాతీలు.. అంతే ఇదే రోజువారీ ఫుడ్ హ్యాబిట్స్ అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి :

Vijay Deverakonda తో బెడ్ రూమ్ సీన్స్.. Raashi Khanna ఫొటోలు వైరల్

Next Story