Unstoppable Season 2: ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్‌వన్ టెలికాస్ట్‌‌కు టైం ఫిక్స్..

by Dishanational4 |
Unstoppable Season 2: ప్రభాస్ ఎపిసోడ్ పార్ట్‌వన్ టెలికాస్ట్‌‌కు టైం ఫిక్స్..
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీ‌లో ప్రస్తుతం ప్రసారం అవుతున్న టాక్ షో 'అన్ స్టాపబుల్ సీజన్ 2'. ప్రతీవారం పలువురు గెస్ట్‌లతో మంచి సరదా అంశాలతో దూసుకుపోతున్నారు బాలయ్య. కాగా, ఈ లేటెస్ట్ ఎపిసోడ్ కోసం జనాలు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే దీనికి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, యాక్షన్ హీరో గోపీచంద్ స్పెషల్ గెస్టులుగా ఉన్నారు. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌కి సంబంధించిన రెండు ప్రోమోలు రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకున్నాయి. అయితే ఈ ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రసారం చేయనున్నట్లు ఆహా మేనేజ్‌ మెంట్ ప్రకటించింది. రీసెంట్‌గా ఎపిసోడ్ మొదటి భాగాన్ని నేడు డిసెంబర్ 29న రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ చేయనున్నట్లు ఆహా నిర్వాహకులు తమ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు.



Next Story