- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Unni Mukundan: ఆ హిట్ మూవీ సీక్వెల్‌పై కీలక ప్రకటన విడుదల చేసిన ఉన్ని ముకుందన్.. ఊహించని పోస్ట్‌తో బిగ్ షాకిచ్చాడుగా!
మలయాళ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్(Unni Mukundan) తెలుగు, మలయాళ సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు.

దిశ, సినిమా: మలయాళ స్టార్ నటుడు ఉన్ని ముకుందన్(Unni Mukundan) తెలుగు, మలయాళ సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక గత ఏడాది ఆయన నటించిన ‘మార్కో’(Marco) మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించడంతో పాటు భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. దీంతో ఉన్ని ముకుందన్ అభిమానులతో పాటు, సినీ ప్రియులంతా ఈ సినిమా సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. తాజాగా, ఉన్ని ముకుందన్ ట్విట్టర్ ద్వారా చిట్ చాట్ చేశారు. ఇందులో భాగంగా ఓ నెటిజన్ ‘మార్కో-2’(marco-2) ఎప్పుడు చేస్తారని అడగ్గా.. దానికి ఉన్ని ముకుందన్ స్పందించి అందరికీ షాకిచ్చారు. ‘‘దయచేసి నన్ను క్షమించండి. ‘మార్కో’ సినిమాకు కొనసాగింపుగా పలు ప్రాజెక్ట్‌లు చేయాలనే ఆలోచనలు విరమించుకున్నాను. ఆ ప్రాజెక్ట్‌పై ఎంతో వ్యతిరేకత వచ్చిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నాను.
‘మార్కో’ కంటే భారీ ఉత్త చిత్రాలను మీకు అందించడం కోసం నేను ఎప్పటికీ శ్రమిస్తుంటాను’’ అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని హనీఫ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇక హింసకు పరకాష్ట అనిపించే సన్నివేశాలతో సాగే కథను ప్రేక్షకులకు చూపించారు. అయితే ఈ మూవీ రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. విడుదలైన ప్రతి భాషలో పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు పలు సీన్స్ విషయంలో విమర్శలు కూడా చవిచూసింది.






