- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూసల సుందరి మోనాలిసా పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. భర్తపై పోక్సో కేసు నమోదు!
ఒక సామాన్య పూసలు అమ్ముకునే అమ్మాయి స్టార్‌గా మారడం, ఆపై మతం మార్చుకుని పెళ్లి చేసుకోవడం.. ఇప్పుడు మైనర్ కావడంతో భర్త జైలుకు వెళ్లే పరిస్థితి రావడం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, సినిమా: గత ఏడాది కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేసిన మోనాలిసా పేరు ఇప్పుడు మరోసారి మారుమోగిపోతోంది. ఓవర్ నైట్ స్టార్‌గా మారిన ఈమె, ఇటీవల తన ప్రియుడు ఫర్మాన్ ఖాన్ను ప్రేమ వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కేరళలోని పూవార్‌లోని ఒక ఆలయంలో వీరి పెళ్లి జరిగినప్పటి నుంచి ఏదో ఒక వివాదం ఈ జంటను వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ వ్యవహారం పోలీస్ కేసు వరకు వెళ్లడం సంచలనంగా మారింది. మోనాలిసా పెళ్లిపై మొదటి నుంచీ వివాదాలు చుట్టుముట్టాయి. వీరి వివాహాన్ని ‘లవ్ జిహాద్’ అని దర్శకుడు సనోజ్ మిశ్రా విమర్శించగా, మోనాలిసా ఆయనపైనే లైంగిక దాడి ఆరోపణలు చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది. అయితే, ఈ గొడవలు సర్దుమణిగాయి అనుకుంటున్న సమయంలో మోనాలిసా మైనర్ అనే విషయం వెలుగులోకి వచ్చింది.
నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (NCST) జరిపిన విచారణలో పెళ్లి సమయానికి ఆమె వయసు తక్కువగా ఉందని తేలడంతో, ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో (POCSO) కేసు నమోదైనట్లు సమాచారం. ఒక సామాన్య పూసలు అమ్ముకునే అమ్మాయి స్టార్‌గా మారడం, ఆపై మతం మార్చుకుని పెళ్లి చేసుకోవడం.. ఇప్పుడు మైనర్ కావడంతో భర్త జైలుకు వెళ్లే పరిస్థితి రావడం ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన పోస్టులు నెట్టింట వైరల్ అవుతుండటంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోనాలిసా నిజంగానే మైనరా? లేక ఇదంతా కుట్రలో భాగమా? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా, కుంభమేళాలో మెరిసిన ఈ పూసల సుందరి జీవితం ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది.






