మొత్తం బట్టలు విప్పేసి న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడమన్నాడు.. స్టార్ సింగర్ సెన్సేషనల్ కామెంట్స్!

by Disha Web Desk 9 |
మొత్తం బట్టలు విప్పేసి న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడమన్నాడు.. స్టార్ సింగర్ సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: సింగర్ చిన్మయికి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతుంటుంది. ఈమె సింగర్ కంటే మీటూ ఉద్యమంతోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఈ సింగర్‌కు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘‘నేను సింగర్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు ఓ గొప్ప ప్లే బ్యాక్ సింగర్‌ను కలిశాను. ఆయన పాడే పాటలకు నేను పెద్ద అభిమానిని. ఆయన ఒకసారి నన్ను స్కైప్‌లో మాట్లాడమన్నాడు. దీంతో నేను ఎగిరిగుంతులేశాను. చాలా సంతోషం వేసింది. నా స్కైప్ ఐడీ నుంచి ఆయనతో వీడియో కాల్‌లో మాట్లాడాను.

కాసేపు అయ్యాక.. మొత్తం బట్టలు విప్పేసి న్యూడ్‌గా మాట్లాడమని అన్నాడు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. చాలా కోపం వచ్చింది. నేను అలా చేయడానికి అంగీకరించలేదు. ఈ విషయం మీడియాకు చెప్తాననే భయం కూడా లేదా అని అడిగాను. దీంతో ఆ సింగర్... ‘‘ నువ్వు ఎవ్వరికీ చెప్పినా పెద్దగా నమ్మరు. అస్సలు నీ మాటలు పట్టించుకోరు. ఎందుకంటే? నాకున్న గుర్తింపు అలాంటిది అని చెప్పాడు. తర్వాత ఫోన్ కట్ చేశాను. ఆయన మాటలు విన్నాక అతడిపైనున్న గౌరవం మొత్తం పోయింది. అప్పటి నుంచి ఆయనతో కాంటాక్ట్‌లో లేను ఇక.’’ అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది. ఈ అమ్మడు ఆ వ్యక్తి పేరును మాత్రం బయటకు చెప్పలేదు.

ఇవి కూడా చదవండి : బెడ్‌పైకి లాగి బట్టలు విప్పేసి పడుకోమన్నాడు: స్టార్ డైరెక్టర్‌పై వర్షిణి సెన్సేషనల్ కామెంట్స్!


Next Story