ప్రభాస్‌తో పోటీకి దిగలేక ‘Dunki’ రిలీజ్‌ వాయిదా వేసుకుంటున్న షారుఖ్!

by Disha Web Desk 10 |
ప్రభాస్‌తో పోటీకి దిగలేక ‘Dunki’ రిలీజ్‌ వాయిదా వేసుకుంటున్న షారుఖ్!
X

దిశ, సినిమా: షారుఖ్ ఖాన్ అప్ కమింగ్ మూవీ ‘Dunki’ రిలీజ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం చర్చనీయాంశమైంది. ఇటీవలే ‘జవాన్’తో భారీ విజయాన్ని అందుకున్న షారుఖ్ మరోసారి ‘Dunki’తో డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇదే డేట్‌లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ టైటిల్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘సలార్‌’ సైతం గ్రాండ్‌గా విడుదలచేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. ఈ క్రమంలో ప్రభాస్ మూవీ ఎఫెక్ట్ షారుఖ్ సినిమాపై పడుతుందని భావించిన ‘Dunki’ మేకర్స్ బాద్ షా సినిమా విడుదల వాయిదా వేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ప్రభాస్ చిత్రం విడుదలైన దాదాపు నెల తర్వాత 2024లో ‘Dunki’ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. దీనిపై మేకర్స్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా న్యూస్ వైరల్ అవుతుండగా.. ప్రభాస్‌ క్రేజ్‌ చూసి షారుఖ్ వెనుకడుగు వేస్తున్నాడంటున్నారు సినీ విశ్లేషకులు.

Next Story

Most Viewed