- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ అవమానం భరించలేకపోయా..సంవత్సరాల తరబడి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది: సమీరా రెడ్డి
నా చిన్నతనంలో నాకు తీవ్రమైన నత్తి ఉండేది. నేను ఏదైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తే అక్షరాలు సరిగ్గా వచ్చేవి కావు.

దిశ, సినిమా: టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో తన గ్లామర్‌తో మెప్పించిన నటి సమీరా రెడ్డి. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా, తన చిన్ననాటి చేదు అనుభవాలను పంచుకున్నారు. "నా చిన్నతనంలో నాకు తీవ్రమైన నత్తి ఉండేది. నేను ఏదైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తే అక్షరాలు సరిగ్గా వచ్చేవి కావు. దానివల్ల నాతో పాటు చదువుకునే పిల్లలు, చుట్టుపక్కల వారు నన్ను విపరీతంగా వెక్కిరించేవారు. నన్ను ఆటపట్టిస్తూ వేధించేవారు. ఆ వయసులో ఆ అవమానాలు భరించడం నాకు చాలా కష్టంగా ఉండేది. నా ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్న సమయం అది ఈ సమస్య నుండి బయటపడటానికి, నాపై నాకు నమ్మకం కలగడానికి నేను సంవత్సరాల తరబడి థెరపీ చేయించుకోవాల్సి వచ్చింది.
ఎన్నో వ్యాయామాలు, కఠినమైన ప్రాక్టీస్ తర్వాతే నేను ఈ రోజు ఇలా ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. కానీ, దురదృష్టవశాత్తూ ఇప్పటికీ నేను ఎప్పుడైనా మాట తడబడి నత్తిగా మాట్లాడితే.. ఎవరైనా దానిపై సెటైర్లు వేసినా లేదా నవ్వుకున్నా నాకు చాలా బాధగా ఉంటుంది. ఆ పాత చేదు జ్ఞాపకాలు మళ్ళీ గుర్తొస్తాయి" అని ఎమోషనల్ అయింది. కేవలం నత్తి సమస్యే కాకుండా, సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తన రంగు గురించి, బాడీ షేప్ గురించి కూడా ఎదురైన విమర్శలను ఆమె ధైర్యంగా ఎదుర్కొన్నారు. లోపాలు ఎవరికైనా ఉంటాయని, వాటిని అధిగమించి ముందుకు సాగడమే నిజమైన విజయమని సమీరా తన మాటల ద్వారా నిరూపించారు. ఒక స్టార్ హీరోయిన్ తన బలహీనతను ఇంత బహిరంగంగా ఒప్పుకోవడం పట్ల నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు.






