ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోదామనుకున్నా: కపిల్ శర్మ

by Disha Web Desk 13 |
ఒత్తిడి తట్టుకోలేక చచ్చిపోదామనుకున్నా: కపిల్ శర్మ
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కమెడియన్, వ్యాఖ్యాత కపిల్ శర్మ గురించి పరిచయం అక్కర్లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కపిల్ తన కెరీర్ స్ట్రగుల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘2017లో డబ్బు సంపాదించడం కోసం కుటుంబాన్ని వదిలి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టాను. యోగక్షేమాలు చూసుకోడానికి ఎవరు లేరు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎదురుగా ఉన్న మనుషుల ఉద్దేశాలు అర్థంకాక ఒంటరిని అయిపోయినట్లు అనిపించేది.

నా మనస్సులో భావాలను అర్థం చేసుకోవడానికి ఎవరూ లేరు. మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. కానీ, బాధ, సంతోషం ఏదైనా కొంతవరకే ఉంటాయని అర్థమైంది. ఒక నటుడు అమాయకంగా ఉన్నాడంటే అతడు తెలివి తక్కువ వాడు కాదు. అతని జీవితంలో అన్ని చేశాడు అని అర్థం’ అని పేర్కొన్నాడు కపిల్.

Next Story

Most Viewed