- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నా ఎదుగుదలను ఓర్వలేక నన్ను నాశనం చేయాలనుకున్నారు.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఎమోషనల్ కామెంట్స్
చాలామంది ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కుట్రలు పన్నారు. కేవలం సినిమాను మాత్రమే కాదు, నా ఎదుగుదలను ఓర్వలేక నా కెరీర్‌ను కూడా నాశనం చేయాలని చూశారు.

దిశ, సినిమా: ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్, తనదైన శైలిలో ప్రేమకథలను, యాక్షన్ చిత్రాలను తెరకెక్కించి సినీ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక ముద్ర వేశారు. ప్రస్తుతం ఆయన నటుడిగా కూడా వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇటీవల ఆయన నటించిన ‘యుఫోరియా’ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో నటుడిగా ఆయన రేంజ్ పెరిగింది. అయితే, దర్శకుడిగా మాత్రం గౌతమ్ మీనన్ గత కొన్నేళ్లుగా తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా విక్రమ్ హీరోగా ఆయన తెరకెక్కించిన ‘ధృవ నక్షత్రం’ విడుదల కాకపోవడం ఆయన కెరీర్‌పై పెద్ద ప్రభావం చూపింది. 2017లో ప్రారంభమైన ‘ధృవ నక్షత్రం’ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా ఇన్నేళ్లుగా విడుదల నోచుకోలేదు. ఈ వివాదం చివరకు కోర్టుకు చేరింది. అయితే, ఎట్టకేలకు గత వారం ఈ కేసులో గౌతమ్ మీనన్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, ఈ చిత్రాన్ని దాదాపు 9 ఏళ్ల నిరీక్షణ తర్వాత మే 27న విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ క్రమంలో జరిగిన ప్రమోషన్లలో గౌతమ్ మీనన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
చాలా ఎమోషనల్ అవుతూ గౌతమ్ మీనన్ ఇలా అన్నారు: "చాలామంది ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలని కుట్రలు పన్నారు. కేవలం సినిమాను మాత్రమే కాదు, నా ఎదుగుదలను ఓర్వలేక నా కెరీర్‌ను కూడా నాశనం చేయాలని చూశారు. కానీ న్యాయస్థానం నాకు అండగా నిలిచింది. ఈ చారిత్రాత్మక తీర్పు భవిష్యత్తులో ఎంతోమంది ఫిలిం మేకర్స్‌కు ధైర్యాన్నిస్తుంది." అని అన్నారు. ఇక తనపై కుట్ర పన్నిన వారికి హెచ్చరిక జారీ చేస్తూ, "నన్ను ఆపడం మీ తరం కాదు" అని ఆయన కుండబద్దలు కొట్టారు. గౌతమ్ మీనన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక సున్నితమైన మనస్తత్వం ఉన్న దర్శకుడు ఇంత తీవ్రంగా స్పందించడంతో, అసలు ఆయన కెరీర్‌ను నాశనం చేయాలని చూసింది ఎవరు? ఆయనతో వివాదం ఉన్న ఆ వ్యక్తులు ఎవరు? అనే చర్చ మొదలైంది. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎదుగుదలను అడ్డుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ మీనన్ ‘ధృవ నక్షత్రం’తో మళ్ళీ ఫామ్‌లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది.






