మనువరాలి వయసున్న హీరోయిన్‌ను మూడో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో?

by Dishanational2 |
మనువరాలి వయసున్న హీరోయిన్‌ను మూడో పెళ్లి చేసుకోబోతున్న స్టార్ హీరో?
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మూడో పెళ్లికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అమీర్ ఖాన్ తన మనుమరాలి వయసున్న హీరోయిన్‌ను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ, దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు సంచలన ట్వీట్ చేశాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే బిరుదు తెచ్చుకున్న అమీర్ ఖాన్, వైవాహిక జీవితంలో మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

ఈయన మొదట రీనా దత్త అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చాడు. ఆ తర్వాత కిరణ్ రావు అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకొని ఆమెకి కూడా విడాకులు ఇచ్చాడు.అయితే ఇప్పుడు,దంగల్ సినిమాలో అమీర్ ఖాన్ పెద్ద కూతురుగా నటించిన హీరోయిన్ ఫాతిమా సనా షేక్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ చాలా సార్లు మీడియా కంట పడ్డారు. ఇక తాజాగా ఉమైర్ సంధు వీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని ట్వీట్ చేయడంతో ఈవార్త వైరల్ గా మారింది. ఇక దీనిపై హీరోయిన్ ఫాతిమా సనా షేక్ మాత్రం తనకి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఇలా లేనిపోని వార్తలు రాయడం సరి కాదని స్పందించింది.

Read more:

అమీర్ ఖాన్‌తో డేటింగ్‌పై స్పందించిన సనా


Next Story

Most Viewed