యశ్ నన్ను వేధింపులకు గురి చేశాడు.. కేజీఎఫ్ హీరోయిన్?

by Dishanational2 |
యశ్ నన్ను వేధింపులకు గురి చేశాడు.. కేజీఎఫ్ హీరోయిన్?
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల నటీనటులపై ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. ఆయన సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్ర‌ముఖ‌ హీరోయిన్ శ్రీ‌నిధి శెట్టిపై ఉమైర్ సంధు పెట్టిన పోస్ట్ క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర దుమారం రేపుతోంది.

కేజీఎఫ్ మూవీ షూటింగ్‌లో యశ్ తనతో పని చేసే క్రమంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు, వేధింపులకు గురి చేశాడు. తనతో కలిసి మళ్లీ సినిమా చేయను అని శ్రీనిధి ఉమైర్ సంధుకు చెప్పినట్లు ఓ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో, ట్వీట్ చూసిన బ్యూటీ వెంటనే స్పందిస్తూ.. యశ్ నాకు గురువు, ఫ్రెండ్ ఓ ఇన్ స్పిరేషన్, రాకింగ్ స్టార్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను, అనవసరంగా సోషల్ మీడియాలో చెడును వ్యాప్తి చేయకండి అంటూ తెలిపింది. దీంతో ఉమైర్ సంధు చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం నిజం లేదని నెటిజన్స్ ఆయనపై మండిపడుతున్నారు.

Also read: సల్మాన్ ఖాన్‌ని చంపడమే నా జీవిత లక్ష్యం: గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్..



Next Story

Most Viewed