- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఫక్ యు పుతిన్’.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఉక్రేనియన్ మోడల్ నిరసన
ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

X
దిశ, సినిమా: ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఉక్రేనియన్ మోడల్ అలీనా బైకోవా షాకింగ్ నినాదంతో దర్శనమిచ్చి జనాలను ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు ‘ఫక్ యు పుతిన్’ అని రాసివున్న టీ షర్ట్ ధరించి ఆమె హల్ చల్ చేయగా.. సెక్యూరిటీ వేదికపైనుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. తర్వాత దీనిపై మాట్లాడిన అలీనా.. ‘ప్రజల జీవితాలు అందంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ, మా జీవితాలు దారుణంగా ఉన్నాయి. రష్యన్లు ప్రతిరోజూ మమ్మల్ని చంపుతున్నారు. దేని కోసం మా నగరాన్ని పూర్తిగా తుడిచిపెడుతున్నారు. అసలు ఏం జరుగుతోంది? మేము ఎందుకు ఇలా బాధపడాలి? ఇతర దేశాలు ఈ యుద్ధంపై ఎందుకు మాట్లాడట్లేదు. మమ్మల్ని ప్రశాంతంగా వదిలేయండి. లేదంటే అవకాశం దొరికినప్పుడల్లా ఇలాగే అరుస్తాం’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read..
Next Story






