'ఉగ్రం' టీజర్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది: పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న నాగ చైతన్య

by Disha Web Desk 13 |
ఉగ్రం టీజర్ నెక్ట్స్ లెవల్‌లో ఉంది: పక్కా బ్లాక్ బస్టర్ అంటున్న నాగ చైతన్య
X

దిశ, సినిమా: అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'ఉగ్రం'. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న మూవీని ఈ వేసవిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగచైతన్య చేతుల మీదుగా తాజాగా టీజర్ విడుదల చేస్తూ ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్. నరేష్ పవర్ ఫుల్ పోలీసుగా ఎంట్రీ ఇవ్వడం, అడవిలో చట్టాన్ని ఉల్లంఘించే వారిని ఎదిరించడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో మొదలై టీజర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇక దీని గురించి మాట్లాడిన చైతన్య.. 'టీజర్ అదిరిపోయింది. నరేష్‌ను చూసి స్టన్ అయిపోయా. 'నాంది' తర్వాత నరేష్ మళ్లీ ఇలాంటి ఇంటెన్స్ రోల్ చేయడం ఆనందంగా ఉంది. 'అల్లరి'తో మొదలుపెట్టి ఈ రోజు ఉగ్రంతో రావడం అద్భుతమైన ప్రయాణం. నరేష్‌తోపాటు టీమ్ అందరికీ అభినందనలు' తెలిపాడు. 'ఈ వేడుకకు అతిథిగా వచ్చిన నాగ చైతన్య గారికి కృతజ్ఞతలు. చైతు నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన చేతుల మీదగా ఈ ఈవెంట్ జరగడం అనందంగా ఉంది' అని తెలిపాడు నరేష్.

Also Read..

షారుఖ్‌ను వెనక్కి నెట్టేసిన రాశీ ఖన్నా.. ఇది ఆశ్చర్యమే!



Next Story

Most Viewed