Ugram: 'ఉగ్రం' సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

by Disha Web Desk 10 |
Ugram: ఉగ్రం సినిమా మొదటి రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్య కాలంలో అల్లరి నరేష్లో అల్లరిని పక్కన పెట్టి సినిమాలను చేస్తున్నాడు.ఒక కామెడీ నటుడు సీరియస్ సినిమాలు కూడా చేయగలడని నిరూపించిన హీరో అల్లరి నరేష్. అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' సినిమా థియేటర్లో సందడి చేస్తుంది. ఈ సినిమాను మొత్తం 515 స్క్రీన్లో విడుదల చేసారు. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ నైజాంలో 2 కోట్లు, సీడెడ్‌లో 1 కోటి రూపాయాలు, ఆంధ్రాలో 2.5 కోట్లు వరకు బిజినెస్ జరిగింది. ఆంధ్రా, నైజాంలో కలిపి మొత్తం 5.5 కోట్ల వరకు బిజినెస్ జరిగింది . కర్ణాటక, ఓవర్సీస్ హక్కులు 1 కోటికి అమ్ముడు పోయాయి. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ 6.5 కోట్లకు జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి . మొదటి రోజు కలెక్షన్స్ చూసుకుంటే.. ఏపీ, తెలంగాణ - 1.5 కోట్ల షేర్, 2 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఓవర్సీస్‌లో చూసుకుంటే 3 కోట్ల గ్రాస్ నమోదు చేసింది.

Also Read..

‘కస్టడీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ అండ్ టైం ఫిక్స్..


Next Story

Most Viewed