ఐ లవ్ యు చెప్పుకున్న ఇద్దరు స్టార్ హీరోలు.. బాత్ రూమ్ నుంచి బయటకు రమ్మన్న డైరెక్టర్

by Disha Web Desk 6 |
ఐ లవ్ యు చెప్పుకున్న ఇద్దరు స్టార్ హీరోలు.. బాత్ రూమ్ నుంచి బయటకు రమ్మన్న డైరెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ దర్శకుడు అట్లీ, షారుఖ్ ఖాన్ కాంబినేషన్‌లో ఇటీవల వచ్చిన చిత్రం ‘జవాన్’. ఈ సినిమా సెప్టెంబర్ 7న థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీసును బద్దలు కొడుతోంది. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్స్ సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది. ఇక అట్లీతో ఎక్కువ సినిమాలు చేసిన హీరో విజయ్ దళపతి కావడంతో, అతని అభిమానులు జవాన్ సక్సెస్ ను తెలుపుతూ సోషల్ మీడియాలో షారుఖ్ ఖాన్‌కు అభినందనలు తెలుపుతూ పలు పోస్టులు పెడుతున్నారు.

వాటికి షారుఖ్ స్పందిస్తూ.. ‘‘చాలా థాంక్స్ తలపతి విజయ్ నెక్స్ట్ మూవీ కోసం నేను ఎంతో ఎదురుచూస్తున్నాను ఐ లవ్ యు విజయ్ సార్’’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా షారుఖ్ ఖాన్ చేసిన ఈ మెసేజ్ కు హీరో విజయ్ సైతం స్పందించారు. ‘‘జవాన్ సినిమా భారీ విజయాన్ని అందుకున్నందుకు టీం మొత్తానికి కంగ్రాట్స్ చెప్పారు.. నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను షారుఖ్ సార్’’ అని బదులిచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ పోస్టులను చూసిన డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని “సర్జీ బాత్ రూమ్ నుంచి బయటి రండి. లోపల ఏం చేస్తున్నారు. ట్రైలర్ చూస్తున్నారా..?” అని ఫన్నీ ట్వీట్ చేశాడు. దీనికి షారుఖ్ బదులిస్తూ.. ‘వచ్చేస్తున్నా సార్. బై బాయ్స్’ అంటూ షారుఖ్ సెషన్ ఎండ్ చేశాడు.


Next Story

Most Viewed