విష్ణు ‘భక్త కన్నప్ప’లో ప్రభాస్, తారక్.. మునుపెన్నడూ లేని పాత్రల్లో పాన్ ఇండియా స్టార్స్

by Bhoopathi Nagaiah |   (  Updated:2023-09-26 07:21:53  IST  )

ఇప్పటి వరకు కామెడీ జోనర్‌‌లోనే అలరించిన టాలీవుడ్ హీరో మంచు విష్ణు.. ఇప్పుడు మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’తో బిజీగా ఉన్నారు.

విష్ణు ‘భక్త కన్నప్ప’లో ప్రభాస్, తారక్.. మునుపెన్నడూ లేని పాత్రల్లో పాన్ ఇండియా స్టార్స్
X

దిశ, సినిమా: ఇప్పటి వరకు కామెడీ జోనర్‌‌లోనే అలరించిన టాలీవుడ్ హీరో మంచు విష్ణు.. ఇప్పుడు మాత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘భక్త కన్నప్ప’తో బిజీగా ఉన్నారు. అన్ని చిత్రాల మారిదిగా కాకుండా ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.. పర్ఫెక్ట్ ప్లాన్‌తో ముందుకు వెళ్తున్నాడు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ మూవీలో శివుడి పాత్రలో స్టార్ హీరో ప్రభాస్, పార్వతీ దేవి పాత్రలో నయనతార నటించనున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇదే సినిమాలో నటిస్తున్న సీనియర్ నటి మధుబాల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇందులో విష్ణుమూర్తి అవతార్‌లో కనిపించబోతున్నట్లు టాక్.

Next Story