మాల్‌లో నటీమణులకు లైంగిక వేధింపులు

by Disha Web Desk 21 |
మాల్‌లో నటీమణులకు లైంగిక వేధింపులు
X

దిశ, సినిమా : మాలీవుడ్ ఫిల్మ్ 'సాటర్‌డే నైట్స్' ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఫిమేల్ లీడ్ యాక్టర్స్ సోనియా అయ్యప్పన్, గ్రేస్ ఆంటోనీ లైంగిక వేధింపులకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన సంఘటన గురించి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇద్దరు.. ఇలాంటి అవాంఛిత గాయాన్ని ఏ అమ్మాయి కూడా ఎదుర్కోకూడదని కోరుకున్నారు. కేరళ కోజికోడ్‌లోని ఓ మాల్‌లో ప్రమోషన్స్ ముగిసిన తర్వాత గ్రేస్‌తో కలిసి బయటకు వచ్చినట్లు తెలిపిన సోనియా.. ఆమెతో కొంతమంది అసభ్యంగా ప్రవర్తించారని తెలిపింది.

రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల కనీసం రియాక్ట్ అయ్యే అవకాశం లేకుండా పోయిందని, ఇంతలోనే తనను కూడా సెక్సువల్‌గా వేధించారని వివరించింది. కచ్చితంగా దీనిపై చర్యలు తీసుకోబడతాయని.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించింది. కాగా ఈ ఈవెంట్‌కు హీరో నివిన్ పౌలీ, అజు వర్ఘీస్ కూడా హాజరయ్యారు.

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న అనుష్క? తెలంగాణ బిజినెస్‌మెన్‌తో కన్ఫామ్?

Next Story