- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kanchana-4: దెయ్యాలుగా ఇద్దరు హాట్ బ్యూటీస్.. అధికారిక ప్రకటనతో సర్‌ప్రైజ్ చేసిన మేకర్స్
హర్రర్ ఫ్యాంచైజీల్లో టాప్‌లో ఉంటుంది ‘కాంచన’ సినిమా. ఈ చిత్రం కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దిశ, సినిమా: హర్రర్ ఫ్యాంచైజీల్లో టాప్‌లో ఉంటుంది ‘కాంచన’ సినిమా. ఈ చిత్రం కోలీవుడ్‌లోనే కాకుండా తెలుగులోనూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఓ వైపు వినోదం అందించడంతో పాటు మరోవైపు బాక్సాఫీసు వద్ద నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దీంతో చిత్రబృందం ఈ మూవీకి సీక్వెల్ తెరకెక్కించగా.. ‘కాంచన-2’ 2011లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. ఒక 2015లో ‘కాంచన-3’రాగా.. ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం రాఘవ లారెన్స్(Raghava Lawrence) ‘కాంచన-4’పనుల్లో ఫుల్ బిజీ అయిపోయారు.
ఈ సినిమాకు రాఘవ దర్శకుడిగా, ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ‘కాంచన-4’ షూటింగ్ కూడా సగం పూర్తి అయినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో రాఘవా లారెన్స్‌తో పూజా హెగ్డే, నోరా ఫతేహి కనిపించనున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు దెయ్యాలుగా నటించబోతున్నట్లు గత కొద్ది కాలంగా ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఈ విషయాన్ని నిజం చేస్తూ అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ‘‘మీ తీవ్ర భయంలో కూడా పూజా హెగ్డే తన అందంతో మిమ్మల్ని మూర్ఛపోయేలా చేస్తుంది.
స్వర్గం మీ కోసం వేచి చూస్తోంది. మా ప్రాజెక్ట్ లోకి పూజా హెగ్డేకు స్వాగతం చెప్తున్నాము’’ అని రాసుకొచ్చారు. అలాగే నోరా ఫతేహి ఫొటో షేర్ చేస్తూ.. ఆమె తన అందంతో మీ హృదయాలను దోచుకోవడానికి సిద్ధమవుతోంది. మీ భయానకతను మరచిపోయేలా చేయడానికి వస్తుంది. నోరా ఫతేహి ఆన్‌బోర్డ్. మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది’’ అని వెల్లడించారు. ఈ రెండు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది.. చూసిన నెటిజన్లు మూడు పార్టులకంటే ‘కాంచన-4’ మరింత భయానకంగా ఉంటుందోమో అని భయపడిపోతున్నారు. లింకు






