- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్‌కు జోడీగా ఇద్దరు భామలు ఫిక్స్?
రామ్ చరణ్(Ram Charan), సుకుమార్ (Sukumar)కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.

దిశ, సినిమా: రామ్ చరణ్(Ram Charan), సుకుమార్ (Sukumar)కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి జతకట్టబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. rc-17 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా, ప్రస్తుతం హీరోయిన్ల ఎంపికపై మేకర్స్ కసరత్తులు చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు చోటుందని, అందుకోసం అనుపమ పరమేశ్వరన్, రుక్మిణి వసంత్ పేర్లను మూవీ టీమ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్ సినిమాల్లో నటించే అవకాశం అనుపమకు ఒకసారి మిస్ అయ్యింది.
కానీ ఈసారి సుకుమార్ మార్క్ సినిమాలో ఆమెకు అవకాశం దక్కడం దాదాపు ఖాయమైందని వినిపిస్తోంది. తన సహజ నటనతో మెప్పించే అనుపమకు ఇది కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. కన్నడ సినిమా ‘సప్త సాగరదాచే ఎల్లో’తో తెలుగు కుర్రాళ్ల మనసు దోచుకున్న రుక్మిణి వసంత్, ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారింది. ఇప్పటికే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న ‘డ్రాగన్’లో ఛాన్స్ కొట్టేసిన ఈ భామ, ఇప్పుడు గ్లోబల్ స్టార్ సరసన నటించే లక్కీ ఆఫర్ అందుకుందని టాక్. ఈ క్రేజీ కాంబినేషన్ పై అధికారిక ప్రకటన వస్తే మెగా ఫ్యాన్స్‌కు పండగే అని చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్నాడు.






