- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ట్విస్ట్.. షాక్ లో ఫ్యాన్స్ !
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (PAWAN KALYAN) తాజాగా నటించిన మూవీ హరిహర

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (PAWAN KALYAN) తాజాగా నటించిన మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా మెరువనున్నారు. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ ఎన్నికలు ఆ తర్వాత జనసేన పార్టీ అధికారంలోకి రావడం... ఇలా అనేక సంఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో... హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
అయితే ఇప్పుడు ఈ సినిమా.. రిలీజ్ కు సిద్ధమైంది. ఈనెల 24వ తేదీన థియేటర్లలో హరిహర వీరమల్లు రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కంటే నాలుగు రోజులు ముందు అంటే 20వ తేదీన.. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేశారు. విశాఖలో ప్రీ రిలీజ్ నిర్వహించాలని.. ముందే ప్లాన్ చేశారట. అయితే ఈ ఈవెంట్ విషయంలో... అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. విశాఖలో కాకుండా హైదరాబాద్ లోని ప్రైవేట్ హోటల్లో... హరిహర వీరమల్లు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట.
ఎక్కువ మంది గెస్టులు లేకుండా... లిమిటెడ్ గా నిర్వహించాలని ఇప్పుడు నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ లుగా రాజమౌళి వస్తారని ముందుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన కూడా రావడం లేదట. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మాత్రమే ఈ ఈవెంట్ కు వెళ్తున్నారని తెలుస్తోంది. దీనిపై ఇవాళ సాయంత్రం అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం అందుతుంది. ఇక ఈ విషయం తెలియడంతో... అభిమానులు షాక్ అవుతున్నారు.






