- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ముడతలను పతకాలతో సమానంగా పరిగణించాలి: Twinkle Khanna ఫన్నీ పోస్ట్
సీనియర్ నటి ట్వింకిల్ ఖన్నా మరో ఫన్నీ డిమాండ్‌తో అభిమానులను అలరించింది..

దిశ, సినిమా: సీనియర్ నటి ట్వింకిల్ ఖన్నా మరో ఫన్నీ డిమాండ్‌తో అభిమానులను అలరించింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోవర్లను ఎప్పటికప్పుడూ ఆశ్చర్యపరిచే ట్వింకిల్.. తాజాగా వయసుతోపాటు మనుషుల్లో వచ్చే మార్పులు, ముఖ్యంగా మహిళల అందంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ మేరకు చాక్లెట్ పేస్ట్రీని ఆస్వాదిస్తున్న వీడియోను నెట్టింట పంచుకుంటూ.. 'ఏజ్ అనేది ఒక గణిత సమస్య. అందులో పరిష్కరించాల్సిన సంఖ్యలు చాలా ఉన్నాయి. మనలో ఒకప్పుడున్న ఉత్సాహం, బలం రోజురోజుకు తగ్గిపోతుంది. అసహ్యంగా కామెంట్లు చేసిన అబ్బాయిలను చెట్లెక్కి మరీ కొట్టిన ఓ యువతి. 40 ఏళ్ల వయస్సులో కొత్త ఆశయాలతో ఉన్న తల్లి. 49 ఏళ్లకు చర్మంపై పడే మడతలు. ముందుకువెళ్తున్న క్రమంలో మనలోని ప్రతీ వెర్షన్‌ను క్యారీ చేస్తారు. వీటన్నింటినీ మెడల్స్‌తో సమానంగా పరిగణిస్తాం. ఈ చర్మం.. జీవితంలో అన్ని యుద్ధాలను గెలిచామనే విషయాన్ని గుర్తుచేస్తుంది. అవునా? కాదా?' అని ఫాలోవర్లను ప్రశ్నిస్తూ నోట్ రాసుకొచ్చింది.






