పెళ్లైన 15 రోజులకే విడాకులు తీసుకున్న బుల్లితెర జంట.. మీకు పెళ్లి అవసరమా అంటూ సింగర్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
పెళ్లైన 15 రోజులకే విడాకులు తీసుకున్న బుల్లితెర జంట.. మీకు పెళ్లి అవసరమా అంటూ సింగర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకులకు సంబంధించిన న్యూస్ ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే బుల్లితెరకు చెందిన మరో జంట విడాకులు తీసుకున్నట్లు నెట్టింట ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. కేవలం పెళ్లి చేసుకున్న 15 రోజులకే ఆ జంట విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కపుల్స్ మరెవరో కాదు కోలీవుడ్‌లో పాపులారిటీ దక్కించుకున్న విష్ణుకాంత్, సంయుక్త. సిప్పుకుల్ ముత్తు అనే టీవీ షో ద్వారా దగ్గరయిన వీరిద్దరూ.. 2023 మార్చి-3 న వివాహం చేసుకున్నారు. తర్వాత ఏవో కారణాలతో కేవలం 15 రోజులకే ఈ జంట విడిపోయారు. అప్పటి నుంచి ఒకరినొకరు దూషించుకోవడం స్టార్ట్ చేశారు. వీరిద్దరు విడిపోవడంపై తాజాగా స్పందించిన సూపర్ సింగర్ కంటెస్టెంట్ రాజ్యలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

సూపర్ సింగర్ కంటెస్టెంట్ రాజ్యలక్ష్మి అంటే ఎవరో కాదు.. ‘పుష్ప’ సినిమాలో సామి సామి అంటూ తమిళ వెర్షన్ పాడిన సింగర్. అయితే ఈమె విష్ణుకాంత్, సంయుక్తపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. విడిపోవాలని ఫిక్స్ అయ్యాక ఈ జంట ఒకరినొకరు తిట్టుకుంటున్నారని.. ప్రజల నుంచి సానుభూతి పొందేందుకే ఈ జంట ఇలా దూషించుకుంటున్నారని తెలిపారు. అయితే.. ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో 15 రోజులకే విడిపోవాలి అనుకున్న వారు అసలు పెళ్లి ఎందుకు చేసుకున్నారు అంటూ మండిపడుతున్నారు నెటిజన్లు

Read More..

చేతిలో బిడ్డతో నెట్టింట ప్రత్యక్షమైన యాంకర్ శివజ్యోతి!

Next Story