మహేష్ మూవీ నుంచి పూజా హెగ్దే తప్పుకోవడానికి త్రివిక్రమ్ కారణమా?

by Dishanational2 |
మహేష్ మూవీ నుంచి పూజా హెగ్దే తప్పుకోవడానికి త్రివిక్రమ్ కారణమా?
X

దిశ, సినిమా: మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీలో మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే, శ్రీ లీలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే రీసెంట్‌గా ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుంది. ఇక తాను తప్పుకోవడానికి కారణం ఏంటి అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ లీలపై ఎక్కువ స్కోప్ ఉండటంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు చాలా రకాల వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని తెలుస్తోంది. ఎందుకంటే నిజానికి త్రివిక్రమ్ ఈ సినిమా షూటింగ్ ఆలస్యం చేస్తూ వస్తున్నారుజ. దీంతో పూజా హెగ్డేకు డేట్స్ విషయంలో సమస్య ఎదురవుతుంది. అందుకే తప్పకుందట. ఇక చేసేదేం లేక శ్రీ లీలను మెయిన్ హీరోయిన్‌గా చేశారు మన గురూజీ. పూజ ప్లేస్‌లో సెకండ్ హీరోయిన్‌గా సంయుక్త మీనన్‌ను తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Read More... మనం ప్రేమలో ఉన్నప్పుడు ఆ పని తప్పకుండా చేయాలి: రకుల్

పూజను చిక్కుల్లో పడేస్తున్న ముగ్గురు హీరోయిన్స్ .. ఎలా అంటే?

Next Story

Most Viewed