- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రెండింగ్‌లో త్రిష పేరు.. ఆ ఇద్దరు స్టార్ హీరోలకు లక్కీ లేడీగా మారిన బ్యూటీ!
థియేటర్లలో అదరగొడుతున్న ‘కరుప్పు’లో త్రిష హీరోయిన్‌గా నటించడం వల్లే సూర్యకు కలిసొచ్చిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా స్టార్ హీరోయిన్ త్రిష పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. 43 ఏళ్లు వచ్చినప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్న ఆమె వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం త్రిష అటు రాజకీయాల్లో, ఇటు సినిమాల్లో వైరల్ గా మారి నిత్యం వార్తల్లో నిలుస్తోంది. దళపతి విజయ్, త్రిషకు ఎఫైర్ ఉందని కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు టీవీకే పార్టీ పెట్టి తొలిసారి పోటీపపడ్డ ఎన్నికల్లో సత్తాచాటిన విజయ్.. సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో త్రిషకు లక్కీ లేడీ అనే ట్యాగ్‌ను ఇచ్చేస్తున్నారు నెటిజన్లు.. తాజాగా, త్రిష మరో స్టార్ హీరోకు కూడా లక్కీ లేడీగా మారిపోయిందని తెలుస్తోంది. త్రిష, సూర్య కాంబోలో వచ్చిన ‘కరుప్పు’ సినిమా సక్సెస్ కావడంతో అమ్మడుని ఆకాశానికెత్తేస్తున్నారు సూర్య అభిమానులు.
ఈ మూవీ మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటిందని తెలుస్తోంది. థియేటర్లలో అదరగొడుతున్న ‘కరుప్పు’లో త్రిష హీరోయిన్‌గా నటించడం వల్లే సూర్యకు కలిసొచ్చిందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. త్రిష లక్కీ లేడీ అని, ఆమె పక్కన ఉంటే విజయం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కాగా.. 2021లో వచ్చిన జై భీమ్ తర్వాత సూర్యకు ఆశించిన స్థాయిలో సక్సెస్ దక్కలేదన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారీ అంచనాలతో థియేటర్లకు వచ్చిన కంగువా, రెట్రో డిజాస్టర్ అయ్యాయి. ఇక ఇటీవల వచ్చిన ‘కరుప్పు’తో సూర్య మళ్లీ సక్సెస్ అందుకున్నాడు. త్రిష సినిమాల విషయానికొస్తే.. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన ‘విశ్వంభర’లో హీరోయిన్ గా చేసింది. మలయాళంలో ‘రామ్’ అనే చిత్రంలోనూ నటించింది. ఇప్పుడు ఆమె లైనప్ లో మరో రెండు మూడు సినిమాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.






