స్టార్ ప్రొడ్యూసర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన త్రిష.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

by Disha Web Desk |
స్టార్ ప్రొడ్యూసర్‌తో పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన త్రిష.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
X

దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ త్రిష ‘పొన్నియిన్ సెల్వన్’తో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేసింది. ప్రజెంట్ ‘లియో’ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టేందుకు రెడీగా ఉంది. అయితే నలభై ఏళ్లు వచ్చిన త్రిష ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందనే విషయంపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం మాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌తో లవ్‌లో పడిందనే ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై క్లారిటీ ఇస్తూ పోస్ట్ పెట్టింది త్రిష. ‘డియర్.. యు నో హూ యూ ఆర్ అండ్ యువర్ టీమ్.. కామ్‌గా ఉండండి. పుకార్లు ఆపండి.. చీర్స్’ అని ట్వీట్ చేసింది. దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. ‘వాట్ ఏ రిప్లయ్.. రూమర్ డిస్మిస్డ్.. త్రిష సక్సెస్‌తో అసూయపడుతున్న ఓ పీఆర్ టీమ్ ఈ పని చేయించింది. మొత్తానికి క్వీన్ సింగిల్‌ అని క్లారిటీ ఇచ్చేసింది’ అని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : Elon Musk తో నటి ప్రేమ వ్యవహారం.. లైఫ్‌లో ఎక్కువ బాధను పొందింది ఆమె వల్లే..

Next Story

Most Viewed