వైట్ శారీలో రచ్చ చేస్తున్న త్రిష..!

by Disha Web Desk 7 |
వైట్ శారీలో రచ్చ చేస్తున్న త్రిష..!
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‏గా ఓ వెలుగు వెలుగుతోంది. ప్రజంట్ ఈ ముద్దుగుమ్మ తెలుగుతోపాటు అనేక తమిళ సినిమాల్లో నటిస్తూ తన కెరియర్ కొనసాగిస్తోంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో సినిమాలతో త్రిష.. తన ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో, సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేస్తూ అదే స్థాయిలో అలరిస్తూ వస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసిన పిక్స్ వైరలవుతున్నాయి. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ పలుచటి శారీ, అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ధరించి అదిరిపోయే లుక్ లో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఇమేజెస్ సూపర్ రెస్పాన్స్ తో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed