- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tripti Dimri: మ్యాజిక్ జర్నీ స్టార్ట్ అయి ఐదేళ్లు అంటూ త్రిప్తి పోస్ట్.. నుదుటిన బొట్టుతో దర్శనమివ్వడంతో అంతా షాక్!
బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) అందరికీ సుపరిచితమే.

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు ‘పోస్టర్ బాయ్స్’(Poster Boys) సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బుల్ బుల్, కాలా, లైలా మజ్ను, వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ సంపాదించుకోలేకపోయింది. ఇక 2023లో ‘యానిమల్’(Animal) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో త్రిప్తి రేంజ్ మారిపోయింది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి. ఒకే ఏడాదిలో మూడు చిత్రాల్లో నటించిన ఆమె తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ప్రస్తుతం ‘ధడక్-2’ (Dhadak-2)మూవీలో నటిస్తోంది. అలాగే తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ‘స్పిరిట్’లో నటించే చాన్స్ కొట్టేసింది.
ఇటీవల మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా, త్రిప్తి డిమ్రి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇందులో చీర కట్టుకుని నగలు ధరించి నుదుటిన బొట్టుపెట్టుకుని కనిపించింది. దీంతో సడెన్‌గా చూసిన వారంతా షాక్ అవుతున్నారు. అదేంటి ఆమెకు పెళ్లి అయిపోయిందా అని ఒక్కసారి ఆమె భర్త కోసం సెర్చ్ చేస్తున్నారు. అయితే త్రిప్తి క్యాప్షన్ చూసి కాస్త ఊపిరిపిల్చుకుంటున్నారు. ‘బుల్‌బుల్’ విడుదలై నేటితో ఐదేళ్లు పూర్తి కావడంతో ఈ పోస్ట్ పెట్టింది. షూటింగ్ ఫొటోలను షేర్ చేస్తూ ‘‘ఈ మ్యాజిక్, మిస్టరీ జర్నీ స్టార్ట్ అయి ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఎర్రటి చంద్రకాంతి దారిలో నడిచిన అమ్మాయి’’ అనే క్యాప్షన్ జత చేసింది.






