‘ఓ రొమియో’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన త్రిప్తి.. వైల్డ్ పోస్టర్ షేర్ చేయడంతో అంతా షాక్

by Mallepaka Hamsa |

‘యానిమల్’ సినిమాలో జోయా పాత్రలో కనిపించి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది త్రిప్తి డిమ్రి(Tripti Dimri).

‘ఓ రొమియో’ నుంచి బిగ్ అప్డేట్ ఇచ్చిన త్రిప్తి.. వైల్డ్ పోస్టర్ షేర్ చేయడంతో అంతా షాక్
X

దిశ, సినిమా: ‘యానిమల్’ సినిమాలో జోయా పాత్రలో కనిపించి ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది త్రిప్తి డిమ్రి(Tripti Dimri). ఆ ఒక్క పాత్రే ఆమె కెరీర్‌ని టర్నింగ్ పాయింట్‌గా మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోయినా, త్రిప్తి క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. గ్లామర్‌తో పాటు నటనలోనూ తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ డిమాండెడ్ హీరోయిన్‌గా మారింది. ఈ క్రేజ్‌కు తగ్గట్టుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే భారీ అవకాశం ఆమె ఖాతాలో పడింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ (Spirit)సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక కావడం త్రిప్తి కెరీర్‌కు మరో పెద్ద మైలురాయిగా మారింది.

అలాగే.. బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న త్రిప్తి, విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘ఓ రోమియో’(O Romeo)లో నటిస్తోంది. ఈ చిత్రంలో షాహిద్ కపూర్(Shahid Kapoor) హీరోగా కనిపించనుండగా, వీరిద్దరి మధ్య రొమాన్స్‌తో పాటు ఇంటెన్స్ సీన్స్ ఉండనున్నాయని సమాచారం. సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దిశా పటాని, విక్రాంత్ మస్సే, నానా పటేకర్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో జరుగుతుండగా, తాజాగా త్రిప్తి ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ‘ఓ రోమియో’ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి రానున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, షాహిద్ కపూర్ ఒళ్లంతా రక్తంతో కనిపించే పవర్ ఫుల్ పోస్టర్‌ను షేర్ చేయడంతో సినిమాపై హైప్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ పోస్టర్ చూసిన నెటిజన్లు షాక్ అవుతూనే, ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందంటూ సోషల్ మీడియాలో ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story