హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతున్న త్రిప్తి డిమ్రి.. ఆ స్పెషల్ డే నాడు రిలీజ్ కాబోతుందంటూ పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ‘యానిమల్’ మూవీతో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది.

హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌తో రాబోతున్న త్రిప్తి డిమ్రి.. ఆ స్పెషల్ డే నాడు రిలీజ్ కాబోతుందంటూ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి(Tripti Dimri) ‘యానిమల్’ మూవీతో ఊహించని పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం వరుస భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తూ క్రేజీ బ్యూటీగా మారిపోయింది. తెలుగు, హిందీ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకుంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. తెలుగులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రంలో చాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ షూట్‌లో పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులు పెడుతోంది. తాజాగా, త్రిప్తి డిమ్రి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొత్త సినిమాను ప్రకటించింది.

‘ఓ రోమియో’ (O Romeo)చిత్రంతో ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించింది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ వచ్చే ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 13న రిలీజ్ కాబోతున్నట్లు తెలిపింది. ఇందులో షాహిద్ కపూర్(Shahid Kapoor) హీరోగా నటిస్తుండగా.. హై-ఆక్టేన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను నదియావాలా గ్రాండ్‌సన్ సాజిత్ నదియావా నిర్మిస్తున్నారు. విశాల్ భరత్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం త్రిప్తి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఫైర్ ఎమోజీలు షేర్ చేస్తున్నారు.

Next Story