షూటింగ్ సెట్‌లో ఘోరం.. సముద్రపు అలల్లో కలిసిపోయిన స్టార్ హీరో!

by Mallepaka Hamsa |

ఒక పడవలో సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రాహుల్ అదుపు తప్పి సముద్రపు నీటిలో పడిపోయారు.

షూటింగ్ సెట్‌లో ఘోరం.. సముద్రపు అలల్లో కలిసిపోయిన స్టార్ హీరో!
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో వరుసగా జరుగుతున్న విషాదాలు అభిమానులను కలచివేస్తున్నాయి. తాజాగా, బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (43) ఒక ప్రమాదంలో మరణించడం కోట్లాది మందిని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, తలసరి బీచ్ సమీపంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక పడవలో సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో రాహుల్ అదుపు తప్పి సముద్రపు నీటిలో పడిపోయారు. వెంటనే చిత్ర యూనిట్ సభ్యులు ఆయను బయటకు తీసి దగ్గరలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్థారించారు.ఈ ప్రమాదంపై బాలాసోర్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. పడవ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకున్నారా? లైఫ్ జాకెట్లు వంటివి అందుబాటులో ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. షూటింగ్ సెట్స్‌లో భద్రతా లోపాలు ఉన్నాయనే అనుమానంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు కూడా విచారణలో భాగస్వామ్యమయ్యారు.

ఒక స్టార్ హీరో ఇలా సామాన్యంగా నీటిలో మునిగి చనిపోవడం ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నటుడిగానే కాకుండా మంచి కథకుడిగా, షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా కూడా రాహుల్ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణవార్త విన్న అభిమానులు సోషల్ మీడియా వేదికగా కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు.కాగా.. రాహుల్ ప్రయాణం 2008లో వచ్చిన 'చిరోదిని తుమీ జే అమర్' చిత్రంతో అద్భుతంగా మొదలైంది. ఆ ఒక్క సినిమాతోనే ఆయన రాత్రికి రాత్రే సూపర్ స్టార్‌గా మారిపోయారు. కేవలం వెండితెరపైనే కాకుండా, బెంగాలీ బుల్లితెరపై కూడా ఆయనకు తిరుగులేని క్రేజ్ ఉంది. 'దేశెర మటి', 'తుమీ అస్బే బోలే' వంటి సీరియల్స్ ద్వారా ఆయన ప్రతి ఇంట్లో ఒక సభ్యుడిగా మారిపోయారు. 43 ఏళ్ల వయసులో, కెరీర్ ఎంతో బిజీగా ఉన్న సమయంలో ఆయన ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడం బెంగాలీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

Next Story