- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టార్ హీరోయిన్ ఇంట్లో విషాదం.. ఈ విషయాన్ని పంచుకోవడానికి చాలా చింతిస్తున్నానంటూ ఎమోషనల్ నోట్..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి (Shilpa Shetty)గత కొద్ది కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పాశెట్టి (Shilpa Shetty)గత కొద్ది కాలంగా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె భర్త పెట్టబడి ఒప్పందానికి సంబంధించిన రూ. 60 కోట్లు మోసం చేశారని ఈ జంటపై కేసు నమోదు అయింది. దీంతో అప్పటినుంచి వీరిద్దరు వార్తల్లో నిలుస్తూ పలు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, శిల్పాశెట్టి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన ఇంట్లో విషాదం చోటుచేసుకోవడం వల్ల.. ఈ ఏడాది వినాయక చవితి వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు వెల్లడించింది. ప్రతి ఏడాది లాగా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నందుకు చింతిస్తున్నట్లు తెలుపుతూ.. ‘‘ప్రియమైన స్నేహితులారా బాధతొ ఈ విషయాన్ని పంచుకుంటున్నాను.
మా కుటుంబంలో ఒకరి వియోగం కారణంగా ఈ సంవత్సరం మేము మా గణపతి వేడుకలను నిర్వహించుకోవడం లేదు. ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము. మా సంప్రదాయం ప్రకారం 13 రోజుల పాటు సంతాప దినాలను పాటించాలి. అందుకే పండుగలు, ఉత్సవాలకు దూరంగా ఉంటాం. చాలా బాధగా అనిపిస్తుంది’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు శిల్పా శెట్టి ఇంట్లో అసలు ఎవరు చనిపోయారే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.






