తెలుగు అగ్ర నిర్మాతల చేతిలో 'Avatar 2'?

by Disha Web Desk 6 |
తెలుగు అగ్ర నిర్మాతల చేతిలో Avatar 2?
X

దిశ, సినిమా : ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ విజువల్ వండర్ మూవీ 'అవతార్ 2'. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైలర్ మూవీపై భారీ అంచనాలు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, దాదాపు 160కి పైగా భాషల్లో విడుదలవుతున్న సినిమా తెలుగు వెర్షన్ రిలీజ్ విషయంలో పెద్ద పెద్ద నిర్మాతలు మంచి ప్లానింగ్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. 'అవతార్ 2' హక్కుల కోసం ఇద్దరు టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ దాదాపు రూ.85 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు తమ సొంత థియేటర్లలో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నందున దాదాపు 25 రోజుల పాటు 'అవతార్ 2' తెలుగు రాష్ట్రాల్లో రన్ అవ్వనుంది. కానీ ఇంతకీ ఆ నిర్మాతలు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

READ MORE

మహిళా కథలే రసవత్తరమైనవి.. ఆ కంటెంట్‌కే నా ప్రిఫరెన్స్ : లేడీ ప్రొడ్యూసర్


Next Story