అవకాశాలు లేక ఐటమ్ గర్ల్‌గా మారబోతున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. ట్వీట్ వైరల్

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ(Ruhani Sharma) ‘చి లా సౌ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

అవకాశాలు లేక ఐటమ్ గర్ల్‌గా మారబోతున్న టాలీవుడ్ యంగ్ హీరోయిన్.. ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ రుహానీ శర్మ(Ruhani Sharma) ‘చి లా సౌ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘హిట్, శ్రీరంగ నీతులు, సైంధవ్ వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. అనతి కాలంలోనే మంచి పాపులారిటీ వచ్చినప్పటికీ పెద్దగా అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ పలు సినిమాలు చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. చివరగా రుహానీ శర్మ ‘బ్లాక్‌అవుట్’ అనే హిందీ మూవీతో ప్రేక్షకులను అలరించింది.

గత ఏడాది నుంచి చాన్సులు రాకపోవడంతో ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోలు షేర్ చేస్తోంది. నిత్యం పిక్స్ షేర్ చేస్తూ దర్శక, నిర్మాతలను మెస్మరైజ్ చేసి సినిమా చాన్స్ అందుకోవాలనే ప్లాన్‌లో ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా, రుహానీ శర్మ ఓ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు ఐటమ్ గర్ల్‌గా మారబోతున్నట్లు టాక్. తమిళ యంగ్ హీరో కవిన్(Kavin) నటిస్తున్న ‘మాస్క్’ (mask)చిత్రంలో రుహానీ శర్మ స్పెషల్ సాంగ్ చేయబోతోంది. కాగా, ఈ సినిమాతో వికర్ణన్ అశోక్(Vikarnan Ashok) దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రంలో ఆండ్రియా జెరెమియా హీరోయిన్‌గా నటిస్తుండగా.. చార్లీ, బాల శరవణన్, వీజే అర్చన చందోక్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

దీనిని గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ, బ్లాక్ మద్రాస్ ఫిల్మ్స్, ది షో మస్ట్ గో ఆన్ బ్యానర్స్‌పై వెట్రిమారన్, ఆండ్రియా,ఎస్పీ చొక్కలింగం నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. చెన్నై నేపథ్యంలో సాగే డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Next Story