- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గొప్ప మనసు చాటుకున్న టాలీవుడ్ యంగ్ హీరో.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి.

దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే సినీ సెలబ్రిటీల కుటుంబాల్లోని ముఖ్యమైన వ్యక్తులను కోల్పోతూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల కమెడియన్ జోష్ రవి తండ్రిని కోల్పోయిన విషయం తెలిసిందే. గుండె పోటుకు గురవడంతో కన్నుమూశారు. ఈ విషయంపై పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. కానీ విషాదంలో ఉన్న ఆయనను ఏ స్టార్ హీరో పరామర్శించడానికి వెళ్లనప్పటికీ ఓ యంగ్ హీరో గొప్ప మనసు చాటుకున్నాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తనయుడు, యంగ్ హీరోగా ఇండస్ట్రీలో రాణిస్తున్న ఆకాష్ పూరి(Akash Puri) స్వయంగా రవి (Ravi)ఇంటికి వెళ్లాడు. అతన్ని హత్తుకుని ధైర్యం చెప్పారు. అంతేకాకుండి రవి తల్లిని ఓదార్చారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని ఎల్లవేళలా మీకు అండగా ఉంటామని చెప్పి ఆర్థిక సాయం కూడా చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆకాష్ పూరీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.






