టాలీవుడ్ నెంబర్ 1 స్థానం ఆ హీరోయిన్‌దేనా?

by Dishanational2 |
టాలీవుడ్ నెంబర్ 1 స్థానం ఆ హీరోయిన్‌దేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : అందాల తార శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తన అందం,నటనతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం నెబర్ వన్ స్థానానికి ఎగబాగుతుంది ఈ చిన్నది.

పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఇక తర్వాత వచ్చి ధమకా సినిమాలో నటనతోనే కాకుండా డ్యాన్స్‌తో మెప్పించి ప్రస్తుతం వరస సినిమాలతో చాలా బిజీ అయిపోయింది.

కన్నడలో రెండు, తెలుగులో రెండు సినిమాలు చేసిన ఆమె కాల్ సీట్ల కోసం ఇప్పుడు తెలుగులో బడా హీరోల సైతం క్యూలో నుంచునే పరిస్థితి వచ్చిందట .పూజా హెగ్డే, రష్మిక లాంటి టాప్ క్లాస్ భామలను కూడా కాదని ఈమె కోసం ఎదురుచూస్తున్నారంటే ఈమె హవా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ముఖ్యంగా మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ, రామ్, వైష్ణవ్ తేజ్ ఇలా ఆమె సినిమాల లిస్టు చూస్తే అసలు ఇన్ని సినిమాలకు ఆమె డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తుందా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఇదే జోరు కొనసాగిస్తే టాలీవుడ్ నెంబర్వన్ కిరీటం ఆమెదేనని నిరభ్యంతరంగా చెప్పవచ్చు .

ఇవి కూడా చదవండి:

అత్యంత ప్రభావవంతమైన మహిళల్లో ఏక్తాకు చోటు.. ఏకైక భారతీయురాలిగా రికార్డ్

ఎవరి సపోర్టుతో వచ్చినా.. సత్తాచూపకపోతే ఔటే: నెపోటిజంపై దివ్యా

OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదలయ్యే తెలుగు,మలయాళ సినిమాలు ఇవే!

Next Story