మహేష్ బాబు అలా చేశారు.. షాకింగ్ విషయం వెల్లడించిన యంగ్ బ్యూటీ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-01 13:12:22  IST  )

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar)హీరోయిన్‌గా ఇండస్ట్రీకి వచ్చింది. తమిళ్ చిత్రాల్లో నటించిన ఆమె మంచి గుర్తింపు దక్కించుకుంది.

మహేష్ బాబు అలా చేశారు.. షాకింగ్ విషయం వెల్లడించిన యంగ్ బ్యూటీ.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ (Aditi Shankar)హీరోయిన్‌గా ఇండస్ట్రీకి వచ్చింది. తమిళ్ చిత్రాల్లో నటించిన ఆమె మంచి గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో మల్టీ స్టారర్ ‘భైరవం’(Bhairavam) సినిమాతో టాలీవుడ్‌కు వచ్చింది. ఇక మే 30న థియేటర్స్‌లోకి వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. ప్రస్తుతం అదితి ‘వన్స్ మోర్’(Once more) అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్‌లో విడుదల కాబోతుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి శంకర్ ఓ సంఘటనను గుర్తు చేసుకుని ఆసక్తికర కామెంట్స్ చేసింది.

‘‘మా నాన్న సినిమా కోసం మేమందరం ఓ చోటుకు వెళ్తున్నాం. ఈ సమయంలోనే దారిలో ఓ హోటల్ దగ్గర బ్రేక్‌ఫాస్ట్ కోసం ఆగాము. మహేష్ బాబుకు మేము అభిమానులం. హోటల్ దగ్గర ఆయన ఉండటంతో నేను నా సోదరి ఓ ఫొటో కోసం దగ్గరకు వెళ్లాము. అందుకు ఆయన ఇప్పుడు ఇవ్వలేనమ్మా అని తిరస్కరించారు. దీంతో నేను డిస్టర్బ్ చేసినందుకు సారీ చెప్పి వెళ్లిపోయాము. అప్పుడు ఆయన పక్కనున్న బాడీగార్డ్ వెళ్లి.. మేము శంకర్ కూతుర్లమని చెప్పాడు.

దీంతో ఆయన మేము ఉన్న టేబుల్ దగ్గరకు వచ్చి మీ కూతుర్లని తేలీదు సార్ అని వివరణ ఇచ్చారు. దానికి మా నాన్ని పర్లేదు.. హీరో ఎలా ఉంటారో వాళ్లకు కూడా తెలియాలి కదా. ఫొటో కావాలంటే మీ దగ్గరకు వచ్చి అడుగుతారు. ఇస్తారా లేదా అనేది నీ నిర్ణయం అని అన్నారు. ఆ తర్వాత మహేష్ బాబు మాతో ఫొటో దిగారు’’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అది చూసిన నెటిజన్లు మహేష్ పక్కన ఉన్నది బాడీగార్డ్ కాదు డైరెక్టర్ మెహర్ రమేష్ అని పాపం అలా అనేసిందేంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story