- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నెల రోజుల్లో 18 కిలోల బరువు తగ్గిన టాలీవుడ్ యంగ్ హీరో.. అతని వల్లేనంటూ కామెంట్స్!
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. దీనికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా.. నిర్మాతగా టాలీవుడ్ హీరోయిన్ చార్మీ కౌర్ వ్యవహరిస్తోంది. అయితే ఇందులో సంజయ్ దత్ విలన్‌గా నటిస్తుండగా.. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ మూవీ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో డబుల్ ఇస్మార్ట్ టీమ్ ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ పోతినేని ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ‘‘స్కంద మూవీ కోసం 20 కిలోల బరువు పెరిగాను. ఇస్మార్ట్ శంకర్ మూవీ క్లైమాక్స్‌లో ఉన్నట్లే డబుల్ ఇస్మార్ట్‌లో కూడా ఓ షర్ట్ లెస్ ఫైట్ సీన్ ఉంటుందని పూరి జగన్నాథ్ అన్నారు. పూరీ నాతో షర్టు విప్పించాడు. ట్రైలర్‌లో కూడా ఆ ఫైట్‌కి సంబంధించి ఓ చిన్న బిట్ ఉంటుంది. అందుకే నన్ను పోస్టర్లలో కూడా షర్ట్ విప్పించాడు.
క్లైమాక్స్ సీన్ గురించి చెప్పాక కిక్ వచ్చింది. డబుల్ ఇస్మార్ట్ మూవీలో కూడా అదే ఫిజిక్ మెయింటైన్ చేయాలని చెప్పడంతో సెప్టెంబర్‌లో స్కంద రిలీజ్ అయితే.. నవంబర్‌లో డబుల్ ఇస్మార్ట్ కోసం బాలి వెళ్లాను. పూర్తిగా ఫోన్ ఆఫ్ చేసి ట్రైనింగ్ మీదనే ఫోకస్ పెట్టాను. దీంతో 86 కిలోల బరువు ఉండేవాడిని 68 కిలోలు తగ్గాను. కేవలం నెల రోజుల్లోనే 18 కేజీలు తగ్గాను’’ అని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ రామ్ కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
- Tags
- Rampothineni






