Nikhil Siddhartha :డ్రగ్స్ తీసుకోమని నాకు ఆఫర్ చేశారు.. హీరో నిఖిల్ హాట్ కామెంట్స్

by Disha Web Desk 2 |
Nikhil Siddhartha :డ్రగ్స్ తీసుకోమని నాకు ఆఫర్ చేశారు.. హీరో నిఖిల్ హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతున్న వేళ హీరో నిఖిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ తీసుకోవాలని తనను గతంలో అనేకసార్లు కొంతమంది ఆఫర్ చేశారని నిఖిల్ వెల్లడించారు. కానీ, తాను మాత్రం ఎన్నడూ డ్రగ్స్ జోలికి వెళ్లలేదన్నారు. మీరు కూడా వాటిజోలికి వెళ్లవద్దని సూచించారు. శనివారం హైదరాబాద్‌లో పోలీసులు ఏర్పాటు చేసిన 'పరివర్తన' కార్యక్రమంలో నిఖిల్ మాట్లాడారు. తాను డ్రగ్స్‌కు ఎప్పుడూ దూరంగా ఉంటానని అందరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. స్టూడెంట్స్‌కు అందమైన జీవితం ఉంది. పార్టీలకు వెళ్లండి ఎంజాయ్‌ చేయండి.. కానీ, డ్రగ్స్‌ తీసుకోకండి.. సే నో టూ డ్రగ్స్ అంటూ హితవు పలికారు. కొందరు చేసిన తప్పిదం వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more: మరో ఖరీదైన కారు కొన్న మహేష్ బాబు.. హైదాబాద్‌లోనే ఎవరి వద్ద లేదంటా..?

Next Story

Most Viewed